Wednesday, April 2, 2008

జల్సా.....మరో ఖుషి??...సమీక్ష

అవును...జల్సా మరో ఖుషి యే...ఎందుకంటే మనకి మళ్లీ ఇంకో సారి ఖుషి చూసినట్టు ఉంటుంది. అవే మానరిసమ్స్ ......అదే తల్వార్ ....అలాగే అంకుల్ అని పిలవడం..........కాని కథా నాయికలు మాత్రం ముగ్గురు....అందులో ఇద్దరు అతిథి నటీమణులే.

ఖుషి 7 సార్లు (మన భారతదేశంలో) చూసిన నాకు పోలికలు కనిపించడం సహజమే. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని కాదు. కాని ఖుషి నచ్చింది. తరవాత సినిమాలేవీ నచ్చలేదు. నటన లో అతి ఎక్కువయ్యింది.

సినిమా....మహేశ్ వాయిస్ ఓవర్ తో మొదలౌతుంది. సంజయ్ సాహు, ఉస్మానియా క్యాంపస్ లో ఫుడ్ కోర్సులు (అంటే మెస్ కోసం ఏదో కాలం వెళ్ళబుచ్చడానికి చేసే కోర్సులన్నమాట) చేస్తుంటాడు, రాత్రుళ్ళు బార్లలోమందు కొడుతుంటాడు. కమలిని ని పెళ్ళి చేసుకోవడానికి వాళ్ల నాన్న దగ్గరికి వెళ్ళి అడిగి భంగ పడతాడు. సరిగ్గా ఒక సంవత్సరం తరవాత ఇంకో అమ్మాయి (భాగమతి) అతని జీవితం లోకి వస్తుంది. ఒక చిన్న ముష్టియుద్దం తో ఆ భాగమతి (ఇలియానా), జ్యోత్స్న(జొ..పార్వతి మెల్టన) లు సంజయ్ మాయలో పడి పోతారు. ఆ అమ్మాయిలు కూడా ఉస్మానియా లోనే చదువుతుంటారు.. ఇక్కడ ఒక డైలాగ్ ఉంది...ఫార్మసీ అమ్మాయిలు...ఫిజిక్స్ అబ్బాయిలు బాగుంటారు అని (నేను, త్రివిక్రమ్ కూడా ఫిజిక్స్ వాళ్ళమే).

జో ప్రేమని సంజయ్ తిరస్కరిస్తాడు. భాగి ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటుంది. చివరికి విజయం సాధిస్తుంది.

త్రివిక్రమ్ మాటలకి పవన్ న్యాయం చెసాడు. బ్రహ్మానందమ్ ని సరిగ్గా ఉపయోగించుకోలేదు..నక్సలైట్ ఎపిసొడ్ బొర్ కొడుతుంది. చే గువేరా గెటప్ బాగుంది. పవన, ప్రకాశ్ రాజ్ఉన్న సన్నివేశాలు బాగున్నాయి. మొత్తానికి కామెడి కోసం సినిమా ఒక్కసారి చూడొచ్చు. మీరు త్రివిక్రమ్ అభిమానులైతే (నా లాగా) చూడొచ్చు. మీరు పవన్ అభిమానులైతే పండగే..ఎందుకంటే అతను ఇటీవల చేసిన సినిమాల కన్నా చాలా బెటర్ .

నాకు నచ్చిన కొన్నిడైలాగ్స్ ..

  • ఇప్పుడు మి టూ అనాలి..తరవాత పెళ్ళంటారు, చీరలు, జాకెట్లు, ఏడుపులు, పెడబొబ్బలు.
  • మీ చూపులు మా వీపుకి తెలుస్తాయి (పూరికి చురకా?)
  • ఆకలేసినా అన్నం తినకుండా ఉండడాన్ని ఉపవాసం అంటారు, నిద్రొచ్చినా పడుకోకుండా ఉండడాన్ని జాగరణ అంటారు, శత్రువు దొరికినా చంపకుండా ఉండడాన్ని మానవత్వం అంటారు.


 

త్రివిక్రమ్ లోని మాటల రచయిత సినిమా కి న్యాయం చేసాడు, కాని అతని లోని చిత్రానువాదకుడు, దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. వీకెండ్ బొర్ కొడితే సినిమా చూడొచ్చు. కలెక్షన్ ల పరంగా నిర్మాత కు లాభాలు తెచ్చి పెట్టే సినిమానే.