బోస్టన్ లో శుక్రవారం చిరుత చూస్తే.....శనివారం న్యూ జెర్సీ లో హ్యాపీ డేస్ చూసాను......
టికెట్ ధర 10 డాలర్లు మాత్రమే.....శేఖర్ గుండె ధైర్యానికి ఇది తార్కాణం......ముందే అమెరికా లో విడుదల చేసాడు............ఆదివారం మా స్నేహితులు చిరుత కి వెళ్ళారు....హాల్ లో చాలా తక్కువ మంది ఉన్నారట.....శేఖర్ దెబ్బ...............చిరుత అబ్బా...........(సునీల్ లా చదవండి)
సినిమా చాలా ఆహ్లాదం గా మొదలౌతుంది....మన కాలేజి లో మొదటి రోజు గుర్తుకొస్తుంది, కొంచెం భయం, కొంచెం ఉత్సాహం, అన్నీ కలగలిపి ఉన్న భావన. చందు, మధు ని మొదటిసారి చూసినప్పుడు వచ్చే “నిన్ను చూసి...........వెన్నెలే అనుకున్నా............నిన్న కూడా......మొన్నలా కలగన్నా...............” అనే లైన్సు, నేపథ్య సంగీతం అద్భుతం.............రాగింగు, క్లాస్ రూము, కంబైండు, చదువులు అన్నీ హృద్యంగా చూపించాడు......టైసన్ చేసే ప్రయొగాలు కొంచెం అతిగా ఉన్నప్పటికీ కామెడీ గా తీసుకుంటే సరిపొతుంది.....................
నాకు నచ్చిన అంశాలు:
సంగీతం అద్భుతం, కాని మిక్కీ కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుంది, రహమాన్ ని అనుకరించకుండా, నేపథ్య సంగీతం, సినిమా మూడ్ లోకి తీసుకెళ్తుంది, విజయ్ కుమార్ ఫొటోగ్రఫి అభినందించ దగినది.
కొత్త నటినటులు చాలా బాగా చేసారు, ముఖ్యంగా చందు, రాజేష్ పాత్ర ధారులు. శేఖర్ కమ్ముల సాంకేతికంగా రోజురోజుకి చాలా ఎదుగుతున్నాడు, ఆనంద్ కన్నా, గోదావరి, గోదావరి కన్నా, హ్యాపీ డేస్ మిన్నగా ఉన్నాయి.
ఊటీ లో తీసిన పాట బాగుంది, టైసన్ స్రవంతి కోసం కోళ్ళు పెంచటం, “పిల్లే పొయినాంక.....కొళ్ళను పట్టుకుంటవేందిరా” అని రాజేష్ చెప్పే డైలాగ్ బాగుంది................శేఖర్ రాసిన సహజ మైన డైలాగులు బాగున్నాయి.
ఒక్కసారి మీ కాలేజికి వెళ్ళి రావాలనుకుంటే, మీ మొదటి ప్రేమ ని గుర్తు చేసుకోవాలనుకుంటే, మిమ్మల్ని రాగ్ చేసిన సీనియర్స్ ని, లేక మీరు రాగ్ చేసిన జూనియర్స్ ని, మీ లెక్చరర్స్ నీ, మొత్తానికి మీ హ్యాపీ డేస్ ని గుర్తు చేసుకోవాలంటె, ఈ సినిమా చూడండి, ఒక మంచి అనుభూతి తో బయటికి వస్తారు...............నేను మళ్ళీ ఈ వారాంతం బోస్టన్ లో చూడాలనుకుంటున్నా..............
లెక్చరర్స్ ని బఫూన్స్ లా చూపించే ఈ కాలంలో, ఒక మంచి కాలేజి సినిమా రావటం ఆనందంగా ఉంది, సరస్వతీ ప్రార్థన పెట్టటం శేఖర్ భావుకత కి నిదర్శనం. సినిమాలో ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాల్ని సరిదిద్దుకుని మరిన్ని మంచి సినిమాలతో..........అర్థవంతమైన సినిమాలతో...శేఖర్ మన ముందుకి రావాలని కోరుకుంటూ...........
ఒక జంధ్యాల, ఒక విశ్వనాథు, ఒక బాపు ఇలా, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న శేఖర్ కమ్ముల ను అభినందిద్దాం.
ఇలాంటి సినిమాలు చూసి, పెద్ద హీరోలు, కళ్ళు తెరిచి, కొన్ని అర్థవంతమైన సినిమాలు తీస్తే, హిందీ లొ లాగా కొన్ని ప్రయోగాలు చేస్తే, ఇన్నాళ్ళు వాళ్ళు వేసిన చెత్త వేషాలన్ని చూసిన నా లాంటి అభిమానుల ఋణం తీర్చిన వాళ్ళవుతారు..............
మా ఫ్రెండ....ఈ సినిమా పై ఆంగ్ల టైటిల్ పెట్టినప్పుడే నాకు 50% మంచి అభిప్రాయం పోయింది అన్నాడు, కానీ సినిమా చూస్తే అసలా విషయమే గుర్తుకు రాదు...........
ముక్తాయింపు ఏమిటంటే.....వెళ్ళి తప్పక చూడండి, మీరు నిరుత్సాహ పడరు, పైగా ఒక మంచి సినిమా చూసిన భావం తో బయటికి వస్తారు.
3 comments:
meerannadi aksharala nijam. maku kooda cinema baga nachindi. entha sepoo mass hits, commercial hits anukovatame kanee ilanti light movies theeyalani enduku anukoro ardham kaadu. you have done a good job by spreading the word..
Vasundhara
cinema enni gantalu?3 hrs or 2.30 hrs
చాలా బాగా రాసారు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, మంచి సీన్స్ మరియు డైలాగుల ని ప్రస్తావిస్తూ. ఎప్పటినుంచో బ్లాగు రాయాలని అనుకుంటున్న నాకు, దానికి కావలిసిన ఇన్స్పిరేషన్ ఈ సినిమా ద్వారా లభించింది. కానీ సినిమా రివ్యూ మత్రం తెలుగు లో రాయలేక ఈ సారికి ఆంగ్లం లొ సరిపెట్టుకున్నాను !!! :-(. మీరు రాసినది చూసి కొంచెం నేర్చుకున్నాను !!! :-). బ్లాగు లొ రాసినట్టు, బోస్టన్ లో కూడా చూసే వుంటారని భావిస్తాను. మరిన్ని మార్లు చూసినా తనివి తీరని సినిమా మరి మన హ్యాప్పీ డేస్ :-).
Post a Comment