Wednesday, October 3, 2007

హ్యాపీ డేస్ - Go and Watch

బోస్టన్ లో శుక్రవారం చిరుత చూస్తే.....శనివారం న్యూ జెర్సీ లో హ్యాపీ డేస్ చూసాను......

టికెట్ ధర 10 డాలర్లు మాత్రమే.....శేఖర్ గుండె ధైర్యానికి ఇది తార్కాణం......ముందే అమెరికా లో విడుదల చేసాడు............ఆదివారం మా స్నేహితులు చిరుత కి వెళ్ళారు....హాల్ లో చాలా తక్కువ మంది ఉన్నారట.....శేఖర్ దెబ్బ...............చిరుత అబ్బా...........(సునీల్ లా చదవండి)

సినిమా చాలా ఆహ్లాదం గా మొదలౌతుంది....మన కాలేజి లో మొదటి రోజు గుర్తుకొస్తుంది, కొంచెం భయం, కొంచెం ఉత్సాహం, అన్నీ కలగలిపి ఉన్న భావన. చందు, మధు ని మొదటిసారి చూసినప్పుడు వచ్చే నిన్ను చూసి...........వెన్నెలే అనుకున్నా............నిన్న కూడా......మొన్నలా కలగన్నా............... అనే లైన్సు, నేపథ్య సంగీతం అద్భుతం.............రాగింగు, క్లాస్ రూము, కంబైండు, చదువులు అన్నీ హృద్యంగా చూపించాడు......టైసన్ చేసే ప్రయొగాలు కొంచెం అతిగా ఉన్నప్పటికీ కామెడీ గా తీసుకుంటే సరిపొతుంది.....................

నాకు నచ్చిన అంశాలు:

సంగీతం అద్భుతం, కాని మిక్కీ కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుంది, రహమాన్ ని అనుకరించకుండా, నేపథ్య సంగీతం, సినిమా మూడ్ లోకి తీసుకెళ్తుంది, విజయ్ కుమార్ ఫొటోగ్రఫి అభినందించ దగినది.

కొత్త నటినటులు చాలా బాగా చేసారు, ముఖ్యంగా చందు, రాజేష్ పాత్ర ధారులు. శేఖర్ కమ్ముల సాంకేతికంగా రోజురోజుకి చాలా ఎదుగుతున్నాడు, ఆనంద్ కన్నా, గోదావరి, గోదావరి కన్నా, హ్యాపీ డేస్ మిన్నగా ఉన్నాయి.

ఊటీ లో తీసిన పాట బాగుంది, టైసన్ స్రవంతి కోసం కోళ్ళు పెంచటం, పిల్లే పొయినాంక.....కొళ్ళను పట్టుకుంటవేందిరా అని రాజేష్ చెప్పే డైలాగ్ బాగుంది................శేఖర్ రాసిన సహజ మైన డైలాగులు బాగున్నాయి.

ఒక్కసారి మీ కాలేజికి వెళ్ళి రావాలనుకుంటే, మీ మొదటి ప్రేమ ని గుర్తు చేసుకోవాలనుకుంటే, మిమ్మల్ని రాగ్ చేసిన సీనియర్స్ ని, లేక మీరు రాగ్ చేసిన జూనియర్స్ ని, మీ లెక్చరర్స్ నీ, మొత్తానికి మీ హ్యాపీ డేస్ ని గుర్తు చేసుకోవాలంటె, ఈ సినిమా చూడండి, ఒక మంచి అనుభూతి తో బయటికి వస్తారు...............నేను మళ్ళీ ఈ వారాంతం బోస్టన్ లో చూడాలనుకుంటున్నా..............

లెక్చరర్స్ ని బఫూన్స్ లా చూపించే ఈ కాలంలో, ఒక మంచి కాలేజి సినిమా రావటం ఆనందంగా ఉంది, సరస్వతీ ప్రార్థన పెట్టటం శేఖర్ భావుకత కి నిదర్శనం. సినిమాలో ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాల్ని సరిదిద్దుకుని మరిన్ని మంచి సినిమాలతో..........అర్థవంతమైన సినిమాలతో...శేఖర్ మన ముందుకి రావాలని కోరుకుంటూ...........

ఒక జంధ్యాల, ఒక విశ్వనాథు, ఒక బాపు ఇలా, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న శేఖర్ కమ్ముల ను అభినందిద్దాం.

ఇలాంటి సినిమాలు చూసి, పెద్ద హీరోలు, కళ్ళు తెరిచి, కొన్ని అర్థవంతమైన సినిమాలు తీస్తే, హిందీ లొ లాగా కొన్ని ప్రయోగాలు చేస్తే, ఇన్నాళ్ళు వాళ్ళు వేసిన చెత్త వేషాలన్ని చూసిన నా లాంటి అభిమానుల ఋణం తీర్చిన వాళ్ళవుతారు..............

మా ఫ్రెండ....ఈ సినిమా పై ఆంగ్ల టైటిల్ పెట్టినప్పుడే నాకు 50% మంచి అభిప్రాయం పోయింది అన్నాడు, కానీ సినిమా చూస్తే అసలా విషయమే గుర్తుకు రాదు...........

ముక్తాయింపు ఏమిటంటే.....వెళ్ళి తప్పక చూడండి, మీరు నిరుత్సాహ పడరు, పైగా ఒక మంచి సినిమా చూసిన భావం తో బయటికి వస్తారు.

చిరుతొస్తే పొత్తే చెయ్యాల.....విడిదిచ్చి వత్తాసియ్యాల..........

గమనిక: నేను ఎవరి అభిమానిని కాదు....ఒక మంచి సినిమా అభిమానిని.

చిరుత సినిమా బోస్టన్ లో, శుక్రవారం రోజు చూసాను. టికెట్ ధర 13 డాలర్లు, కొంచెం ఎక్కువే, పాపం వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేదు, అందుకే దొరికినప్పుడే బరుక్కుందాం అనుకున్నారేమో......

నేను ఏ అంచనాలు లేకుండా ఈ సినిమా కు వెళ్ళాను. చిరంజీవి కొడుకని కొంచెం ఉత్సుకత మాత్రం ఉండింది., ఈ మధ్య చిరంజీవి అంటే విరక్తి కలిగింది, స్టాలిన్ లాంటి సినిమాలు చూసాక......ఇక చిరుత లోకి వద్దాం.......

నాకు నచ్చిన అంశాలు:

· చరణ్ పరిచయమయ్యే సన్నివేశం

·

· సంగీతం, నేపథ్య సంగీతం

·

· చాయా గ్రహణం

·

· అలీ, బ్రహ్మానందాన్ని పెళ్ళి చేసుకోమని అడిగే సన్నివేశం

· చరణ్ నృత్యాలు, పోరాటాలు.

·

ఇంత వరకు ఏ నూతన నటుడు ఇంత బాగా చెయ్యలేదు (తెలుగులో.....హిందీ లొ కాదు, హృతిక్ ని ఎవ్వరూ బీట్ చెయ్యలేరు......).....మొదటి సినిమాలో......

పూరి...ఫక్తు, చరణ్ ఏం చెయ్యగలడో చూపించడానికే అన్ని సన్నివేశాలను రాసుకున్నాడు........ఇదో పెద్ద గొప్ప సినిమా అని చెప్పను...కాని కొత్త హీరో ని ఎలా చూపించాలో....అలా చూపించాడు......రెండు చోట్ల చరణ్ ని నీ యబ్బ అని వేరే కారక్టర్ లు తిడతాయి.......ఘరానా మొగుడు టైం లో...ఏంది బే అన్నందుకు.....ఇద్దరు అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు......ఇప్పుడు మరి ఎంత మంది పిచ్చి నా...........ఆత్మహత్య చేసుకుంటారో............

ముఖ్యంగా చరణ్ కామెడి పైన దృష్ఠి పెట్టాలి.......రాజమౌళి, మళ్ళి మాస్ సినిమా తీస్తాడట...చరణ్ తో......ఒకే మూస లో ఇరుక్కు పోవడానికి చరణ్ రడీ అన్నమాట.......

సివరాఖరికి నే చెప్పొచ్చేదేమిటంటే......ఈ సినిమా మీ వీలున్నప్పుడు చూడండి.......అంత తొందరేమ్ లేదు....కాని చూడండి, చరణ్ కోసం....................

Thursday, August 23, 2007

యమదొంగ.....సమీక్ష కాదు...





నేను మొన్నే యమదొంగ చూశాను.....సినిమా బాగుందా లేదా అనేది పక్కన పెట్టి.....నటీ నటుల, సాంకేతిక నిపుణుల పనితనం గురించి రాయాలనుకుంటున్నాను......

రాజమౌళి:

  • కొన్ని చోట్ల గురువు గారిని అనుకరించాడు
  • ఇంకా హింసాత్మక దృశ్యాల పైన మక్కువ పోలేదు
  • హాస్యం ప్రయత్నించాడు
  • టీవీ సీరియల్ అనుభవం తో సాగతీత నేర్చుకున్నాడు
  • మొత్తానికి మంచి ప్రయత్నం....తన శైలికి భిన్నం గా తీసాడు।
కీరవాణి:
  • అన్ని బాణీలు ఎక్కడో విన్నట్టే ఉంటాయి
  • దాలేర్ మెహందీ పాట, మన జానపద గేయాల్ని, పంజాబీ జానపదాల్నీ కలిపి బాణి కట్టాడు
  • నేపథ్య సంగీతం బాగుంది...ఎప్పట్లానే
  • కాసెట్ లో తను పాడిన....మెల మెల్లగా గాలి పాటను సినిమాలో మనో చేత పాడించాడు (ధన్యవాదాలు దేవుడా)
  • నేను పండితుణ్ణి అనే పొగరు కొంత తగ్గించుకుని......మరో సుర్ , జిస్మ్ లాంటి సినిమాలకు ఇచ్చినట్టుగా, తెలుగు లో ఇస్తే బాగుంటుంది।
ఎన్ । టి । ఆర్ .

  • బరువు తగ్గి బాగున్నాడు
  • నృత్యాలు బాగా చేసాడు...ఎప్పట్లాగానే
  • హాస్యం....ప్రయత్నించాడు
నిర్మాతలు:
  • నిర్మాణ విలువలు బాగున్నాయి
  • ఇలాంటి మంచి చిత్రాలు తీస్తే బాగుంటుంది
సెంథిల్ , కళ :
  • సెట్టింగ్స్ బాగున్నాయి
  • కెమెరా పనితనం చాలా బాగుంది

సినిమా....చూడొచ్చు..., చివరి 20 నిమిషాల హింసాత్మక దృశ్యాలు మినహా......

తరవాతి పోస్టు: చిరుత ఆడియో సమీక్ష

వివేకానందుడు.....భరత నాట్యం......



మన యువత, వివేకానందున్ని, సంస్కృతి, సంప్రదాయాల్ని మరచి పోతున్న సమయం లో...ఒక విదేశీ ప్రధాని వివేకానందున్ని, భరత నాట్యాన్ని, కథక్ ని, సుభాష్ చంద్రబోస్ నీ, గాంధీని, ఉటంకించడం, సంగీతజ్ణుల, నాట్యజ్ణుల శ్వాస, లయ తో ఎలా మమేకమౌతుందో అలా జపాన, భారతాలు కలవాలని ఆకాంక్షించడం ఎంతైనా ఆనందించ దగ్గ విషయం।



ఆయన ఇవన్నీ మాట్లాడేటప్పుడు...మన రాజకీయ నాయకులు పార్లమెంట్ లో పడుకుని ఉంటారు!



Thursday, August 16, 2007

బొమ్మలాట

మన జీవితం...ఒక బొమ్మలాట...

సహజ కవి బమ్మెర పోతన చిన్నప్పుడు వాళ్ళమ్మతో భాగవతం (సంస్కృతం లో జరిగే) చూడ్డానికి వెళ్ళి అడిగిన ప్రశ్నలు, ఆవిడ ఇచ్చిన జవాబులు, పద్యరూపములో

ఉ: ఇవ్విధి దివ్వటీల్వెలుంగులేమని బాలుడు పృఛ్ఛ సేయగా
నవ్వుచు లక్కమాంబ నిజ నందను గన్ గొని చంద్ర సూర్యులా
దవ్వుల వెల్గనేలయనె, దాపున నా తెరయేల యన్నచో
నివ్వటిలుం బయిన్మసక నీలపు నింగినదేలరా? యనెన్

చ: వెలుగులనీను పొద్దుటను వేసములాడవదేలనన్నచో
దళతళలాడు తారకలు తాము పవల్గన రావదేల యం
చల దెలవారునంత దుదియై చను నాటకమేల యన్న రే
ల్కలలన్ గనుటెల్ల మేలుకొనగా కనరాదది యేలరా? యనెన్

ఉ: వచ్చుచు బోవుచుండె నటవర్గములోనికదేలయన్నచో
చచ్చుచు బుట్టుచుండె జనసంఘము భూస్థలి నేలయంచు వా
రెచ్చటకేగుచుండిరన నెవ్వడు వారికి వేసమిచ్చుచున్
బుచ్చునో యట్టి సూత్రధరుపొంతకు పోదురటంచు పల్కినన్

ఉ: ఏగిన వీరిగాంచి యతడేమని పల్కునతన్న వారి వే
షాగతులంబొనర్చి యెటులాడుదు పాడుడటంచు తెల్పెనో
యాగతి యాడిపాడినహా! యని వారల మెచ్చు నిచ్చు మేల్
భోగములట్లు జేయమిని పొండని దండన జేయువాడనిన్

Monday, August 13, 2007

గ్రామ సింహం - ఒక కథ

నాకు గ్రామ సింహాలంటే...చిరాకా, భయమా, అసహ్యమా....కాదు అన్నీ కలిపి. నేను రాత్రుళ్ళు, హైదరాబాదు నుండి మా ఇంటికి వెళ్ళినప్పుడు నాకు తోడుగా (ప్రాణాలు తోడుతూ) బస్ స్టాండ్ నుండి వచ్చేవి. ఒక సారి మా నాన్నను కరిచినప్పటి నుండీ నాకు వాటిపై అవ్యాజమైన అ(సహ్యం)చి(రాకు)భ(యం) ఇంకా పెరిగింది.

అమెరికా వచ్చిన కొత్తలో...విశ్వా అడవి (woods) చూడడానికి వస్తావా అని అడిగితే, విక్రాంత్ పటేల్, నేను ఎగేసుకొని పోయినం. అమెరికాలో అడవి ఎలా ఉంటుందో చూద్దామని. మన దేశంలో కంటే అందంగా ఉంటుందేమోనని ఏదో కుతూహలం (దీన్నే కొన్ని ఏరియాల్లో గుల (దూల) అంటారు).

మైక్ అని తెల్ల సోదరుడు...వాడి కార్లో, మైక్ డ్రైవింగ్ సీట్లో, విశ్వ వాడి పక్క సీట్లో...వెనక సీట్లో విక్రాంత్, నేను, ఇంకా రెండు శునక రాజాలు (ఒకటి మైక్ ది, ఇంకొకటి వాడి మిత్రురాలిది.....ఆ అమ్మాయి ఊరు వెలుతూ వీడిని కాపలా ఉంచింది...ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చిందంటే ఇదేనేమో)...ఇక్కడ కొందరిని are you single అంటే ...I have a dog అనో I have a cat అనో చెబుతారు। ఆ రెండు శునక రాజాలు...వైయెస్సూ...చంద్రబాబు లా...ఎప్పుడూ కొట్లాడుకుంటాయి। నిన్ను కడిగేస్తానివాల.... అని నాలుక తో కడిగేసుకుంటాయి(ప్రేమతో కాదు)। చివరికి, ఆ తొక్కలో అడవి చూసి చచ్చి చెడి ఎలాగో ఇల్లు చేరినం।

మొన్న ఈ మధ్య మా ఆఫీసు మీటింగ్ ఉంటే, కాలిఫొర్నియా వెళ్ళాల్సి వచ్చింది। మధ్యలో ఒక ఫ్లైట్ మారాలి. అక్కడినుండి నేను వెళ్ళాల్సిన ఊరు ఒక గంట ప్రయాణం. అదో చిన్న విమానం. నాది చిట్ట చివరి సీటు. మన సిటి బస్ లో లాగ ఒకవైపు సింగిల్ సీటు, మరో వైపు ఇద్దరు కూర్చునే విధంగా డబుల్ సీటు. నా పక్కన డబుల్ సీటు లొ ఒక అమెరికన్ అమ్మాయి, దాని పెంపుడు శునకం. ఈ మధ్యనే పెట్స్ ని అనుమతిస్తున్నారట. మా ముందు సీట్లో ఉన్న వృధ్ధ దంపతులు॥ఆరా తీస్తే తెలిసింది. ఆ కుక్క బొచ్చు, ఆ అమ్మాయి టి-షర్ట్ కి అంటితే పీకి విమానం లోనే పడేస్తుంది, నాకప్పుడు బ్రహ్మనందం డైలాగ్ "నా మొహమ్మీద కాకి రెట్టెయ్య" టైపులో..."నా మొహమ్మీద కుక్క బొచ్చెయ్య" అనాలనిపించింది.

మా మామయ్య, వాళ్ళ స్నేహితుని అమ్మ గారు చనిపోతే పలకరించడానికి వెళ్లారు. ఆయన సింపుల్ గా పెద్దావిడ, వయసొచ్చింది, పోయారండి అని, వాళ్ళ కుక్కని వాకింగ్ కి తీసుకెళ్ళారట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పెంపుడు కుక్కే ముఖం పై కరిచింది...పాపం ఈయన ముద్దు పెట్టుకోబొయాడట.

ఆ మధ్య కోటి కాలేజ్ లో స్టుడెంట్స్ ని కుక్కలు కరిస్తే పట్టించుకునే దిక్కులేకుండా పొయింది. మన అమల గారేమో ఇప్పుడు వాటికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స లు చేయిస్తుంది. ఇంతకు ముందు పిచ్చి కుక్కలని చిత్తకార్తె లో మునిసిపాలిటీ వాళ్ళు చంపే వాళ్ళు, మనుషులని కరవకుండా. మనుషుల ప్రాణాలు కుక్కల కంటే హీనమయ్యాయా?

గమనిక: పెంపుడు కుక్కలతో మూతులు ము.. నాకించుకునే వాళ్లు నన్ను క్షమించండి.
ముందు మనుషుల్ని మనుషులుగా చూడడం నేర్చుకుందాం...తర్వాత జంతువుల సంగతి