Thursday, August 16, 2007

బొమ్మలాట

మన జీవితం...ఒక బొమ్మలాట...

సహజ కవి బమ్మెర పోతన చిన్నప్పుడు వాళ్ళమ్మతో భాగవతం (సంస్కృతం లో జరిగే) చూడ్డానికి వెళ్ళి అడిగిన ప్రశ్నలు, ఆవిడ ఇచ్చిన జవాబులు, పద్యరూపములో

ఉ: ఇవ్విధి దివ్వటీల్వెలుంగులేమని బాలుడు పృఛ్ఛ సేయగా
నవ్వుచు లక్కమాంబ నిజ నందను గన్ గొని చంద్ర సూర్యులా
దవ్వుల వెల్గనేలయనె, దాపున నా తెరయేల యన్నచో
నివ్వటిలుం బయిన్మసక నీలపు నింగినదేలరా? యనెన్

చ: వెలుగులనీను పొద్దుటను వేసములాడవదేలనన్నచో
దళతళలాడు తారకలు తాము పవల్గన రావదేల యం
చల దెలవారునంత దుదియై చను నాటకమేల యన్న రే
ల్కలలన్ గనుటెల్ల మేలుకొనగా కనరాదది యేలరా? యనెన్

ఉ: వచ్చుచు బోవుచుండె నటవర్గములోనికదేలయన్నచో
చచ్చుచు బుట్టుచుండె జనసంఘము భూస్థలి నేలయంచు వా
రెచ్చటకేగుచుండిరన నెవ్వడు వారికి వేసమిచ్చుచున్
బుచ్చునో యట్టి సూత్రధరుపొంతకు పోదురటంచు పల్కినన్

ఉ: ఏగిన వీరిగాంచి యతడేమని పల్కునతన్న వారి వే
షాగతులంబొనర్చి యెటులాడుదు పాడుడటంచు తెల్పెనో
యాగతి యాడిపాడినహా! యని వారల మెచ్చు నిచ్చు మేల్
భోగములట్లు జేయమిని పొండని దండన జేయువాడనిన్

2 comments:

రానారె said...

"పోతన చిన్నప్పుడు వాళ్ళమ్మతో భాగవతం చూడ్డానికి వెళ్ళి ..." అంటే సంస్కృతంలోని భాగవతమే కదూ? పోతనకన్నా ముందు తెలుగులో భాగవతం ఉందా అని ఆలోచింపజేస్తూంది మీ టపా.

ప్రియమైన నీకు......... said...

ధన్యవాదములు....సంస్కృతమ్ లో అని మారుస్తాను