నేను మొన్నే యమదొంగ చూశాను.....సినిమా బాగుందా లేదా అనేది పక్కన పెట్టి.....నటీ నటుల, సాంకేతిక నిపుణుల పనితనం గురించి రాయాలనుకుంటున్నాను......
రాజమౌళి:
- కొన్ని చోట్ల గురువు గారిని అనుకరించాడు
- ఇంకా హింసాత్మక దృశ్యాల పైన మక్కువ పోలేదు
- హాస్యం ప్రయత్నించాడు
- టీవీ సీరియల్ అనుభవం తో సాగతీత నేర్చుకున్నాడు
- మొత్తానికి మంచి ప్రయత్నం....తన శైలికి భిన్నం గా తీసాడు।
- అన్ని బాణీలు ఎక్కడో విన్నట్టే ఉంటాయి
- దాలేర్ మెహందీ పాట, మన జానపద గేయాల్ని, పంజాబీ జానపదాల్నీ కలిపి బాణి కట్టాడు
- నేపథ్య సంగీతం బాగుంది...ఎప్పట్లానే
- కాసెట్ లో తను పాడిన....మెల మెల్లగా గాలి పాటను సినిమాలో మనో చేత పాడించాడు (ధన్యవాదాలు దేవుడా)
- నేను పండితుణ్ణి అనే పొగరు కొంత తగ్గించుకుని......మరో సుర్ , జిస్మ్ లాంటి సినిమాలకు ఇచ్చినట్టుగా, తెలుగు లో ఇస్తే బాగుంటుంది।
- బరువు తగ్గి బాగున్నాడు
- నృత్యాలు బాగా చేసాడు...ఎప్పట్లాగానే
- హాస్యం....ప్రయత్నించాడు
- నిర్మాణ విలువలు బాగున్నాయి
- ఇలాంటి మంచి చిత్రాలు తీస్తే బాగుంటుంది
- సెట్టింగ్స్ బాగున్నాయి
- కెమెరా పనితనం చాలా బాగుంది
సినిమా....చూడొచ్చు..., చివరి 20 నిమిషాల హింసాత్మక దృశ్యాలు మినహా......
తరవాతి పోస్టు: చిరుత ఆడియో సమీక్ష
1 comment:
("ఉల్లం చక్కా ఆరబోసే వయసే") అర్థం తెలిపినందుకు చాలా చాలా థాంక్స్. నిజంగా అంత మంచి అర్థం ఉందా అందులో! అందుకే అంటారు: మంచి రచన different లేయర్స్‌తో ఉంటుందని. మనం లోతుగా పయనించేకొద్దీ దాని సౌందర్యం ప్రవర్థమానమౌతూ వస్తుంది. హేట్సాఫ్ వేటూరీ! ప్రియమైన మీకు మరోసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు.
Post a Comment